గూగుల్ పే పై కేసు.. ఢిల్లీ హైకర్టులో వాజ్యం దాఖలు
గూగుల్‌కు చెందిన చెల్లింపుల యాప్ గూగుల్‌పే అనుమతులు లేకుండా ఖాతాదారుల ఆధార్, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరిస్తోందని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన కోర్టు బుధవారం యుఐడిఎఐ, ఆర్‌బిఐలను స్పందించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై నవంబర్ 8లోపు వివరణ ఇవ్వాలని గూగుల్ డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది.
గూగుల్ పే షరతులు, నిబంధనల్లో బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు, ఆధార్ వివరాల సేకరణ నిబంధనలు ఉన్నాయని పిటిషనర్ అయినా ఫైనాన్సీయల్ ఎకనామిస్ట్ అభిజిత్ మిశ్రా ఆరోపించారు. ఇది ఆర్‌బిఐ అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న వ్యవహారమని పిల్‌లో పేర్కొన్నారు. ఈ పిటీషన్‌పై దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు యూఐడీఏఐ, ఆర్బీఐలను ప్రశ్నించింది. ఈ ఆరోపణలు ఎంతవరకూ నిజమే చెప్పాలని సూచించింది. ఈ పిటీషన్‌పై నవంబర్ 8లోగా స్పందించాలని గూగుల్ డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు కూడా జారీ చేసింది.
ఇకపోతే.. గూగుల్ పే టర్మ్స్ కండిషన్స్‌లో బ్యాంక్ అక్కౌంట్ వివరాలతో పాటు ఆధార్ వివరాల్ని సేకరించే నిబంధనలున్నాయని.. ఇది అనుమతులకు విరుద్ధం నడుస్తున్న వ్యవహారమని అభిజిత్ మిశ్రా అనే ఓ ఆర్ధిక నిపుణుడు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశాడు.
ఒక ప్రైవేటు కంపెనీగా గూగుల్‌కు ఆధార్, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరించడం, యాక్సెస్ పర్మిషన్ వంటి అధికారాలు ఉండవు. మరోవైపు ఆర్బీఐ ఆథరైజేషన్ లేకుండానే లావాదేవీలు నడిపిస్తోందంటూ మరో పిల్ దాఖలు చేశాడు. అయితే ఇది పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ కాదని..థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ మాత్రమేనని గతంలోనే ఆర్బీఐ, గూగుల్ ఇండియాలు కోర్టుకు విన్నవించాయి.