శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (17:15 IST)

గోరంట్ల ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన చంద్రబాబు

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివాదానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. ఎమ్మెల్యే గోరంట్లకు ఫోన్ చేసిన చంద్రబాబు.. దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. అన్ని సమస్యలూ పరిష్కరించుకుందామని ఆయనకు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయన్ను ఆహ్వానించారు. దీంతో చంద్రబాబుతో గోరంట్ల భేటీ అయ్యారు. 
 
కాగా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడుతారని ప్రచారం జోరుగా జరిగింది. గత కొద్ది రోజులుగా పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన.. టీడీపీని వీడేందుకు సిద్ధమైమయ్యారు. 
 
దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భేటీ కావడం సర్వత్ర ఆసక్తి రేపింది.