ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (11:17 IST)

కుమార్తె ప్రవర్తన సరిగాలేదనీ గొంతుపై కాలేసి తొక్కిచంపేశారు...

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తమ కుమార్తె ప్రవర్తన సరిగా లేదన్న కారణంతో ఆమె గొంతుపై కాలేసి తొక్కి చంపేశారు. ఆ తర్వాత శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తమ కుమార్తె ప్రవర్తన సరిగా లేదన్న కారణంతో ఆమె గొంతుపై కాలేసి తొక్కి చంపేశారు. ఆ తర్వాత శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని చింతపల్లి మండలం తీరేడు అనే గ్రామానికి చెందిన నరసింహ, లింగమ్మ అనే దంపతులకు 13 యేళ్ల కుమార్తె ఉంది. ఈమె ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. దీంతో ఆమె ప్రవర్తనను సందేహించిన తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఆ బాలిక తీరుమారలేదు. 
 
దీంతో తండ్రి నరసింహ కూతురి గొంతు నులిమాడు. అప్పటికీ కసితీరక గొంతుపై కాలేసి తొక్కి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే కిరోసిన్ పోసి నిప్పంటించి తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతిపై సందేహించిన పోలీసులు ఆరా తీయగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నరసింహ, లింగమ్మ దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.