ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (06:23 IST)

యేడాదికి ముందే సత్తా చూపిద్దాం... కేసీఆర్ వ్యూహం... గుత్తాతో రాజీనామా?

సార్వత్రిక ఎన్నికలకు ఒక యేడాది ముందు తమ సత్తా చాటేందుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు వ్యూహం రచించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించనున్నారు. ప్రస్

సార్వత్రిక ఎన్నికలకు ఒక యేడాది ముందు తమ సత్తా చాటేందుకు తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు వ్యూహం రచించారు. ఇందుకోసం ఆయన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించనున్నారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ ఎంపీగా గెలిచి తెరాసలో చేరిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో నల్గొండ ఎంపీ పదవికి గుత్తాతో రాజీనామా చేయించారు. తన రాజీనామా లేఖను ఈ నెల 14న పార్లమెంట్ స్పీకర్‌కు ఆయన అధికారికంగా అందజేయనున్నట్టు తెలుస్తోంది. ఎంపీ పదవికి ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గెలవడం ద్వారా తమ పార్టీ సత్తా ఏంటో నిరూపించుకునే ఉద్దేశంలో తెరాస అధినేత కేసీఆర్ ఉన్నారని సమాచారం.
 
దీంతో నల్గొండ ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందుగానే తమ సత్తా చాటే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ ఉందని సమాచారం. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతలు వారి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుత్తా తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ ఉపఎన్నికలో తెరాస గెలవడం ద్వారా తాము బలంగా ఉన్నామనే విషయాన్ని అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి తెలియజెప్పాలని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు.