శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (22:12 IST)

గ్యాంగ్‌స్టర్ నయీం ఇంట్లో రూ. కోట్ల విలువ చేసే పత్రాలు... వందల సంఖ్యలో పోర్న్ సిడీలు...

నల్లగొండ- భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్ కౌంటర్ అనంతరం నయీం ఇంట్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. అతడి ఇంట్లో సోదా చేయగా కోట్ల రూపాయలు విలువ చేసే భూమి పత్రాలతో పాటు పిస్తోళ్ల

నల్లగొండ- భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్ కౌంటర్ అనంతరం నయీం ఇంట్లో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. అతడి ఇంట్లో సోదా చేయగా కోట్ల రూపాయలు విలువ చేసే భూమి పత్రాలతో పాటు పిస్తోళ్లు, 200 పైగా సిమ్ కార్డులు, 2 కోట్ల రూపాయలకు పైగా నగదుతో పాటుగా వందల సంఖ్యలో పోర్న్ సిడీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు... అతడి ఇంట్లో అతడి భార్యతో పాటు కొందరు పిల్లలు కూడా ఉన్నట్లు కనుగొన్నారు. వారి వ్యవహారం చూస్తే మనుషులను అక్రమ రవాణా చేస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందని పోలీసులు వెల్లడించారు.
 
నయీం ఇంట్లో సోదాలు ముగిశాక అతడి బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. మిర్యాలగూడలో నయీం అత్త, ఆమె సోదరిల ఇళ్లలో తనిఖీ చేయగా సుమారు. రూ. 6.50 లక్షలు లభించింది. ఇంకా రెండు బ్యాగుల నిండుగా డబ్బు, భూమి పత్రాలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. తనిఖీలు పూర్తిస్థాయిలో ముగిసిన తర్వాత నయీంతో సంబంధమున్నవారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కాగా మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నయీం హతమైన సంగతి తెలిసిందే.