శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (09:26 IST)

అవినీతి కేసులో సస్పెండ్ అయిన షేక్ పేట తాహసీల్దార్ సుజాత మృతి

sujatha
గత 2020లో అవినీతి కేసులో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై విడుదలైన తెలంగాణ షేక్‌పేట తాహసీల్దార్ సి.హెచ్.సుజాత (46) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె బ్లడ్ కేన్సర్‌‍తో చనిపోయారు. గత 2020లో షేక్‌పేట తాహశీల్దారుగా పని చేస్తున్న సమయంలో ఆమెను అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ తర్వాత సుజాతను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తన భార్య అక్రమాస్తుల కేసులో తనను ఏసీబీ విచారణకు పిలవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆమె భర్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ వచ్చిన అజయ్ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భర్త మరణంతో పాటు అవినీతి కేసులో అరెస్టు, విధుల నుంచి సస్పెన్షన్ వంటివి సుజాతను మానసికంగా కుంగదీశారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురైంది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుజాతకు బ్లడ్ కేన్సర్ ఉన్నట్టు ఇటీవలే బయటపడింది. దీంతో ఆమె కీమో థెరపీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు శనివారం గుండెపోటుకు గురయ్యారు. ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రక్త కేన్సర్ కారణంగానే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.