బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (11:36 IST)

హైదరాబాదులో దారుణం: గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ

crime scene
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. గోనె సంచిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. లంగర్ హౌస్ ప్రాంతంలో రెండు బస్తాల్లో పక్షవాతానికి గురైన వ్యక్తి మృతదేహం ఛిద్రమైంది. 
 
ఎక్కడో చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి రెండు బస్తాల్లో వేశారు. వాటిని లంగర్ హౌస్ ప్రాంతంలో పుట్‌పాత్‌పై వుంచారు. గోనె సంచి నుంచి రక్తం వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గోనె సంచి విప్పి చూసి షాక్ అయ్యారు. గోనె సంచిలో రెండు ముక్కలుగా డెడ్ బాడీ వుండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొందన్నారు. 
 
మిలటరీ ప్రాంతానికి సమీపంలోని బాపూఘాట్ నుంచి లంగర్ హౌస్‌కు వస్తున్న ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాళీమందిరం సమీపంలో హత్య చేసి ఇక్కడ పడేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.