బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు
తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా నడ్డా ఆయనకు బీజేపీ సభ్యత్వ రశీదు అందజేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి బీజేపీ అగ్రనేత నడ్డాను కలిశారు. ఆయన వెంట తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు తదితరులున్నారు.