మంగళవారం, 27 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (17:30 IST)

బీజేపీలోకి సాదినేని యామిని... కేంద్రమంత్రి సమక్షంలో చేరిక

టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని శర్మ బీజేపీ గూటికి చేరారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆమెకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
 
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం గత నవంబర్‌లో ఆమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు. చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె స్పష్టం చేశారు.

తన వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో టీడీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. తదనంతర పరిణామాల తర్వాత ఎట్టకేలకు ఆమె కమల దళంలో చేరారు.