శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (06:24 IST)

భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారు?: బీజేపీ

మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

రాజధానిలో ప్రజాప్రయోజన కోణం ఉండాలి గానీ.. రాజకీయ కోణం ఉండొద్దని సూచించారు. మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

కర్నూల్​లో హైకోర్టు ఏర్పాటుకు తమ పార్టీ ముందు నుంచీ మద్దతు తెలుపుతోందన్న జీవీఎల్... హైకోర్టు ఉన్నంత మాత్రాన ఓ ప్రాంతాన్ని రాజధానిగా చూడలేమన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తున్నామనీ.. రాజకీయ, సామాజిక కోణాల్లో తీసుకునే నిర్ణయాలను స్వాగతించేది లేదని స్పష్టం చేశారు.

రాజధాని కోసం వేల ఎకరాలు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో ప్రజాప్రయోజన కోణం ఉండాలిగానీ.. రాజకీయ కోణం ఉండొద్దని సూచించారు.