1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 డిశెంబరు 2019 (06:44 IST)

బీజేపీది నియంతృత్వం: కమల్ ఆగ్రహం

భారతీయ జనతా పార్టీ  నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందని మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌ హాసన్‌ విమర్శించారు.

దేశవ్యాప్తంగా చిచ్చు రగిలిస్తున్న పౌరసత్వ సవరణ చట్టా నికి వ్యతిరేకంగా మద్రాస్‌ యునివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీబావం తెలిపేందుకు కమల్‌ అక్కడికి వెళ్లారు. కానీ కమల్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేయడంతో బయటినుంచే విద్యార్థులతో మాట్లాడారు.

ఈ బిల్లు దేశానికి సంబంధించినదని, ఏ బిల్లు వెనక్కి తీసుకోలేనంత గొప్పది కాదన్నారు. ఇది ప్రజలకు మంచి చేయదనుకుంటే ప్రభుత్వం దాన్ని వెనుక్కు తీసుకునే అవకాశముంటుందని కమల్ హాసన్ అన్నారు.

కాగా, పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో కమల్‌హాసన్‌ కూడా ఉన్నారు.