సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (08:16 IST)

బీజేపీకి భారీ షాక్.. వైసీపీలో చేరనున్నబీజేపీ నేత ఫ్యామిలీ

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు.. సోమవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోకరాజు గంగరాజు మొదట్నుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటూ కీలకనేతగా ఉన్నారు.

బీజేపీ కంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీతోనూ సన్నిహితంగా ఉండేవారు. ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడు ఏపీకి వచ్చినా గోకరాజు అతిథి గృహంలోనే బస చేసేవారు. అమిత్ షాకు గోకరాజు సన్నిహితుడు.