శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (16:30 IST)

ఆన్‌లైన్‌ క్లాస్‌లు.. బాలికకు వేధింపులు.. నాలుగు లక్షలు గోవిందా..

కరోనా కారణంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు వింటున్న విద్యార్థులకు కేటుగాళ్లకు తాకిడి మొదలైంది. అమాయకంగా అపరిచితుల చేతికి చిక్కి అభాసుపాలవుతున్నారు. దీంతో విద్యార్థులకు ఫోన్‌ ఇవ్వడానికి తల్లిదండ్రలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ సమీపంలోని జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 10వ తరగతి చదువుతున్న ఓ బాలికకు ఇస్టాగ్రామ్‌లో ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఆమెతో స్నేహం పెంచుకొని వేధింపులకు పాల్పడ్డారు. ఫోటో మార్ఫింగ్‌ చేస్తామని బెదిరించి నాలుగు లక్షలు వసూలు చేశారు.
 
ఇక ఇంట్లో డబ్బు మాయం కావడంతో బాలికను తల్లిదండ్రులు నిలదీయగా అసలు నిజం బయటపెట్టింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మగ్గురిని అరెస్టు చేశారు. 
 
పిల్లలు సోషల్‌ మీడియాలో సమయం గడపకుండా చూడాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల ఆన్‌లైన్‌ విద్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు కేటుగాళ్ల తాకిడి మరింత ఆందోళకు గురిచేస్తోంది.