శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (08:08 IST)

శ్రావణిని అన్ని విధాలుగా వాడేసిన అశోక్ రెడ్డి.. అయినా ఆశ చావలేదు...

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో 'ఆర్ఎక్స్ 100' చిత్ర నిర్మాత అశోక్ రెడ్డిని మూడో నిందితుడిగా చూపించారు. కానీ, శ్రావణి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రధాన కారణం అశోక్ రెడ్డేనని తెలుస్తోంది. ఎందుకంటే.. శ్రావణితో గత 2017 నుంచి పరిచయం ఉన్న అశోక్ రెడ్డి.. అప్పటి నుంచి ఆమెను అన్ని విధాలుగా వాడుకున్నారు. 
 
పైపెచ్చు.. తాను నిర్మించిన 'ఆర్ఎక్స్100' చిత్రంలో కూడా ఓ చిన్నపాటి గెస్ట్ రోల్ ఇప్పించాడు. అలా శ్రావణిని అమితంగా ఇష్టపడిన అశోక్ రెడ్డి.. ఆమె తనను కాదని దేవరాజ్ రెడ్డిని పెళ్లి చేసుకుంటానంటే తట్టుకోలేక పోయాడు. అందుకే మరో నిందితుడైన సాయికృష్ణారెడ్డితో కలిసి టార్చర్ పెట్టసాగాడు. 
 
ముఖ్యంగా, శ్రావణి ఆర్థిక పరిస్థితిని అడ్డంపెట్టుకొని అశోక్‌ రెడ్డి వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. శ్రావణికి పలుమార్లు అశోక్‌ రెడ్డి ఆర్థికసాయం చేశాడు. ఆర్థికసాయం నెపంతో శ్రావణిపై అశోక్‌ రెడ్డి జులుం ప్రదర్శించినట్లు చెబుతున్నారు. తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని అశోక్‌ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తేలినట్లు చెబుతున్నారు. 
 
శ్రావణి చనిపోయినరోజు కూడా అశోక్‌ రెడ్డి శ్రావణి ఇంటికొచ్చాడు. శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు. అదేసమయంలో శ్రావణి ఇంటికి కూడా సాయి వచ్చాడు. సాయి, అశోక్‌ రెడ్డి శ్రావణిని హింసించినట్టు సమాచారం. ఇద్దరి వేధింపులను ఆమె దేవరాజ్‌తో షేర్‌ చేసుకుంది. 
 
అయితే, దేవరాజ్ మాత్రం.. సాయి, అశోక్‌ రెడ్డిలను పూర్తిగా దూరం పెడితేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. అది సాధ్యపడేలా లేదని గ్రహించిన శ్రావణి... ఈ ముగ్గురు వేధింపులు భరించలేనని భావించి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. మొత్తంమీద ముక్కోణపు ప్రేమలో శ్రావణి ప్రాణాలు తీసుకుంది.