శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (12:39 IST)

చంచల్‌గూడ జైలుకు ఆర్ఎక్స్100 మూవీ నిర్మాత

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ3గా ఉన్న "ఆర్ఎక్స్100" మూవీ నిర్మాత అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఏ1 నిందితుడుగా సాయికృష్ణరెడ్డి, ఏ2గా దేవరాజ్ రెడ్డిలు ఉన్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురిని హైదరాబాద్, ఎస్ఆర్ నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుంచి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత వారిని జైళ్లకు తరలించారు. ఇందులోభాగంగా, అశోక్ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు మార్చారు. 
 
కాగా, ముక్కోణపు ప్రేమకు శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దేవరాజ్‌రెడ్డిని ఇష్టపడిన శ్రావణి.. పెళ్లి చేసుకుని ఒత్తిడి తెచ్చింది. అయితే, శ్రావణికి అశోక్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో కూడా సంబంధం ఉండటంతో పెళ్లి చేసుకునేందుకు దేవరాజ్ నిరాకరించారు. అదేసమయంలో దేవరాజ్‌కు శ్రావణి దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేని సాయి, అశోక్‌ రెడ్డిలు ఆమెను బెదిరించారు. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.