మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (17:15 IST)

ముగ్గురితో రిలేషన్.. ఒకరితో పెళ్లి ప్రపోజల్... అదే శ్రావణికి శరాఘాతం...

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో సరికొత్త అంశం ఒకటి తెరపైకి వచ్చింది. ఈ కేసును విచారించిన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు.. రిమాండ్ రిపోర్టు తయారు చేసింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నట్టు సమాచారం. ముఖ్యంగా, శ్రావణి ముగ్గురితో రిలేషన్‌ కొనసాగిస్తూనే, దేవరాజ్ రెడ్డిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది. 
 
కానీ, శ్రావణి వ్యవహారం క్షుణ్ణంగా తెలిసిన దేవరాజ్.. శ్రావణిని పెళ్లి చేసుకనేందుకు సమ్మతించలేదు. పైగా, దేవరాజ్‌తో ఉన్న స్నేహబంధాన్ని తెంచుకోవాలని సాయికృష్ణారెడ్డి, ఆర్ఎక్స్ 100 చిత్ర నిర్మాత అశోక్ రెడ్డిలు శ్రావణిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. అటు దేవరాజ్ పెళ్లికి నిరాకరించడం, ఇటు సాయి, అశోక్ రెడ్డిలు ఒత్తిడి చేయడాన్ని తట్టుకోలేని శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్టు సమాచారం. 
 
శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ1గా సాయికృష్ణారెడ్డి, ఏ2గా అశోక్ రెడ్డి, ఏ3గా దేవరాజ్ రెడ్డిల పేర్లను పోలీసులు చేర్చారు. అలాగే, ఈ కేసులో ఇప్పటివరకు 17 మంది సాక్షులను పోలీసులు విచారించి, పలు కీలక విషయాలను రాబట్టారు. 
 
కుటుంబ సభ్యుల ముందు దేవరాజ్‌ రెడ్డికి శ్రావణి ప్రపోజ్ చేయగా, శ్రావణి కుటుంబసభ్యులు దేవ్‌రాజ్‌ను అడగడంతో ఒప్పుకోలేదు. దేవ్‌రాజ్‌ను శ్రావణి ఒప్పించే ప్రయత్నం చేసింది. అయితే సాయికృష్ణ, అశోక్ రెడ్డి‌లతో శ్రావణి రిలేషన్ ఉండటంతో దేవరాజ్ ఈ పెళ్లికి అంగీకరించలేదు. 
 
ఆ తర్వాత దేవరాజ్‌ను కలిసేందుకు శ్రావణి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైపెచ్చు... సాయి, అశోక్ రెడ్డిలతో పాటు కుటుంబ సభ్యులు బెదిరించడంతో ఒత్తిడిని భరించలేక శ్రావణి అఘాయిత్యానికి పాల్పడింది. 
 
ఒక దశలో దేవరాజ్‌తో కలిసి హైదరాబాద్ విడిచి పారిపోయేందుకు సైతం శ్రావణి ప్రపోజ్ చేసింది. కానీ, దేవరాజ్ మాత్రం అందుకు అంగీకరించలేదు. దీనికి ప్రధాన కారణం సాయి, అశోక్ రెడ్డిలతో శ్రావణికి ఉన్న రిలేషనే కారణంగా తేలింది.