Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆస్పత్రిలో మద్యం వద్దన్నందుకు దూకేశాడు.. అంతే మృతి

Written By సెల్వి
Updated: గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:44 IST)
ఆస్పత్రిలో మద్యం తాగవద్దని చెప్పిన పాపానికి ఓ రోగి ఆస్పత్రి భవనం నుంచి కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన నాగరాజు (22) ఈ నెల రెండవ తేదీన పురుగులమందు తాగాడు. 
 
గమనించిన భార్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ నాగరాజు చికిత్స పొందుతున్నాడు. రోజూ చుక్కేసే ఆ మనిషికి.. ఆస్పత్రిలోనూ మందేయాలనిపించింది. 
 
అంతే ఆస్పత్రికి మద్యాన్ని తీసుకురావాలని భార్యను కోరాడు. ఆస్పత్రిలో మద్యం తాగొద్దని ఆమె వారించడంతో కోపంగా ఆమెను తోసేసి అక్కడి నుంచి వెళ్లాడు. 
 
కొద్దిసేపటి నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే  మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

అన్నీ చూడండి

Navdeep: సొంత ఊరిలో స్కూల్‌, మొహబ్బత్‌ సినిమా తీసినందుకు హాట్సాప్ : నవదీప్

Venu Swamy: చిన్న చిత్రాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి : వేణు స్వామి

NTR Warning : ఇది నిజంగా సిగ్గుమాలిన చర్య.. ఎవ్వరినీ వదిలిపెట్టను : ఎన్.టి.ఆర్.

Aadhi Pinisetty : ఆది పినిశెట్టి మరకతమణి 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు

Tammareddy Bharadwaja: నానీస్ పేరడైజ్ చిత్రాన్ని విమర్శించిన వారిని ఘాటుగా శపించిన తమ్మారెడ్డి భరద్వాజ

తర్వాతి కథనం
Show comments