మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (11:45 IST)

వరంగల్ మహిళకు అరుదైన అవకాశం... ప్రధాని మోడీతో మాటామంత్రి

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ గ్రామీణ జిల్లా మహిళకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. ‘ఆత్మనిర్భర్‌ నారీశక్తి సే సంవాద్‌’ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు నజీమాతో ప్రధాని మోడీ ముచ్చటించనున్నారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల నిర్వహణ, వాటి ద్వారా మహిళల అభివృద్ధి అనే అంశంపై జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి నజీమా ఎంపికైనట్లు ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ దయాకర్‌ తెలిపారు. ఇదిలావుంటే, ఒక దేశ ప్రధానితో మాట్లాడే అవకాశం రావడంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.