ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: సోమవారం, 25 జనవరి 2021 (20:14 IST)

వ్యక్తిని బూటు కాళ్లతో తొక్కి లాఠీలతో చితకబాది మీ ఆయన్ని తీస్కెళ్లన్న పోలీసులు

పోలీసుల అత్యుత్సాహం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసుల వ్యవహార తీరును ప్రశ్నించి తన ఫిర్యాదు ఎందుకు తీసుకోవట్లేదు అన్నందుకు.. ఒక రోజంతా చితక్కొట్టి బూటు కాళ్లతో తొక్కి పడేశారు పోలీసులు. దీంతో 38 ఏండ్ల వెంకటేష్ తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
 
చికిత్స పొందుతూ మృతి చెందారు. రోజు కూలి పని చేసుకునే వెంకటేష్‌కు నలుగురు పిల్లలు. అయితే ట్రాక్టర్ విషయంలో ఓ వ్యక్తి ఇతనిపై పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేసారు. అయితే వెంకటేష్ కూడా అతనిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు ఇచ్చాడు. నిర్లక్ష్యంగ వ్యవహరిస్తూ పోలీసులను ప్రశ్నించాడు. ఇంకేముంది పోలీసుల లాఠీలకు పని చెప్పారు.
 
బూటు కాళ్లతో తొక్కారు. తమ కార్యక్రమం అయిపోయాక వెంకటేష్ భార్య లక్ష్మీకి ఫోన్ చేసి మీ భర్తను కాస్త మందలించాం తీసుకెళ్లు అని చెప్పారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న వెంకటేష్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిఐ రాజుపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీకి బాధితులు పిర్యాదు చేశారు. అదేవిధంగా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు.