Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

9 నుంచి తెలంగాణ ప్రవేశ పరీక్షలు

Written By ఎం
Updated: సోమవారం, 24 ఆగస్టు 2020 (09:31 IST)
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే నెల 9వ తేదీ నుంచి ఎంసెట్‌తోపాటు పీజీఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌ తేదీలను కూడా నిర్ణయించింది.

ఇందులో ఇంజినీరింగ్‌ విభాగ పరీక్ష 4 రోజులపాటు 8 విడతల్లో, అగ్రికల్చర్‌ విభాగ పరీక్ష 2 రోజులపాటు 4 విడతల్లో జరగనుంది. అలాగే పీజీ ఈసెట్‌ 8 విడతల్లో(4 రోజులు), ఐసెట్‌ 3 విడతల్లో(రెండు రోజులు), ఎడ్‌ సెట్‌ 3 విడతల్లో (రెండు రోజులు) నిర్వహించనున్నారు.

పరీక్ష కేంద్రాల్లో కరోనా నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాలను భారీగా పెంచారు.

అలాగే, విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానిక జిల్లా కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరయ్యేలా అవకాశమిచ్చారు.

ఈ నెల 31న ఈసెట్‌తో ప్రారంభం కానున్న పరీక్షలు.. అక్టోబరు 4న జరిగే లాసెట్‌తో ముగియనున్నాయి.  పరీక్షలకు మొత్తం 4,00,728 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.  

అన్నీ చూడండి

సినీ సెలెబ్రిటీలపై ఆర్జీవీ ఫైర్ - డీప్‌ఫేక్‌పై మీరు చేసేంది ప్రచారమే.. న్యాయం కాదు...

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం

తర్వాతి కథనం
Show comments