గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (11:35 IST)

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో వున్న బీజేపీ సర్కారు క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుందని తెలంగాణ మంత్రులు అన్నారు. ఈ పరాభవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. 
 
కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణితో వ్యవహరించడం తప్పితే.. సంక్షేమం గురించి ఆలోచించే మనసే లేదని తెలంగాణ మంత్రులు తెలిపారు. ఏ అంశంలోనూ నవ్యత్వం లేదని తెలంగాణ మంత్రులు చెప్పారు. 
 
ముఖ్యమంత్రి ఆలోచించి తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తామని తెలంగాణ మంత్రులు ప్రెస్ మీట్ ద్వారా తెలిపారు. రైతుల ప్రయోజనాలను తమ ప్రభుత్వం పరిరక్షిస్తుందని.. తెలంగాణ రైతులు అధైర్యపడవద్దని నిరంజన్ రెడ్డి చెప్పారు.