శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (12:53 IST)

తెలంగాణాలో దారుణం - ఆఫీసులో వీఆర్వో దారుణ హత్య

తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాహశీల్దారు కార్యాలయంలోనే వీఆర్వో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తాహశీల్దారు కార్యాలయంలో జరిగింది. ఇక్కడ కొత్తపల్లి వీఆర్వోగా పని చేస్తున్న దుర్గంబాబు (50) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు చంపేసి పారిపోయారు. 
 
తాహశీల్దారు కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును గుర్తించిన కార్యాలయ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.