సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... పుష్పగుచ్ఛం పంపిన గవర్నర్
అనారోగ్యానికి గురైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆకాంక్షిస్తూ, ఆయనకు పుష్పగుచ్చం పంపించారు. "సీఎం త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోరగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. చిన్నపాటి అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆందోళనకు గురైనట్టు పేర్కొన్నారు.
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెల్సిందే. దీంతో ఆయన్ను హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.