సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (12:36 IST)

గాంధీ ఆస్పత్రిలో యువ డాక్టర్ పూర్ణ చందర్ గుండెపోటుతో మృతి

హైదరాబాద్ నగరంలో ఆస్ప‌త్రిలో విషాదం నెల‌కొంది. డాక్ట‌ర్ పూర్ణ చంద‌ర్(28) గుండెపోటుతో బుధ‌వారం ఉద‌యం చ‌నిపోయారు. బుధ‌వారం ఉద‌యం డాక్ట‌ర్ పూర్ణ చంద‌ర్ త‌న విధులు ముగించుకున్న అనంత‌రం గాంధీ ఆస్ప‌త్రిలోని నాలుగో అంత‌స్తు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా కుప్ప‌కూలిపోయాడు. 
 
అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను ఎమర్జెన్సీ వార్డుకు త‌ర‌లించారు. అయిన‌ప్ప‌టికీ అత‌ను వైద్యానికి స‌హ‌క‌రించ‌లేదు. గుండెపోటుతో పూర్ణ చంద‌ర్ మ‌ర‌ణించిన‌ట్లు సీనియ‌ర్ వైద్యులు నిర్ధారించారు.
 
డాక్ట‌ర్ పూర్ణ‌చంద‌ర్ జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో ఇటీవ‌లే సీనియ‌ర్ రెసిడెన్సీ పూర్తి చేశారు. ప్ర‌స్తుతం పూర్ణ చంద‌ర్ గాంధీలో సీనియ‌ర్ రెసిడెంట్ డాక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. అయితే డాక్ట‌ర్ పూర్ణ చంద‌ర్ మంగ‌ళ‌వారం స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తోటి జూనియ‌ర్ డాక్ట‌ర్లు చెప్పారు. 
 
ఛాతీలో నొప్పి వ‌స్తుంద‌ని, క‌డుపుంతా వికారంగా ఉన్న‌ట్లు పూర్ణ‌చంద‌ర్ తెలిపిన‌ట్లు జూడాలు పేర్కొన్నారు. అందుకోసం మెడిసిన్స్ వేసుకున్నాడ‌ని, బుధ‌వారం మ‌ళ్లీ విధుల్లో చేరార‌ని జూడాలు స్ప‌ష్టం చేశారు.