శ్వేతాబసు : మీడియాకు థ్యాంక్స్.. మా తాతయ్యను కోల్పోయా!
శ్వేతాబసు మీడియాపై మండిపడింది. మీడియా థ్యాంక్స్ అంటూనే జర్నలిస్టుల వల్ల మా తాతయ్యను కోల్పోయానని చెప్పింది. మీడియా తనపై లేనిపోని వార్తలు ప్రచురించడంతో మా తాతయ్య తనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని వాపోయింది.
తన తల్లి కోర్టుల వెంట తిరిగి తనను రెస్క్యూ హోం నుంచి ఇంటికి తెచ్చుకుందని చెప్పింది. తన తల్లిదండ్రులు తనకు అండగా నిలిచారని.. తాను నిజాయితీగానే ఉన్నానని శ్వేతబసు తెలిపింది. ప్రస్తుతానికి హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ డాక్యుమెంటరీని పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.
తల్లిదండ్రుల మద్దతుతో పై చదువులు చదవాలనుకుంటానని, సినిమా, నటన కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని, ఈ ఒక్క సంఘటనతో తన జీవితాన్ని నాశనం చేసుకోనని శ్వేతాబసు వెల్లడించింది.