గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By SELVI.M
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (21:58 IST)

జంబో లేడిస్‌తో శాటిస్‌ఫై అవుతున్న నందమూరి బాలయ్య!?

నందమూరి బాలయ్య మూడు పాత్రల్లో నటించిన "అధినాయకుడు" జూన్ ఒకటో తేదీ విడుదల కానుంది. ఈ చిత్రంలో జంబో లేడిస్‌తో నందమూరి బాలకృష్ణ చిందులేశాడు. వెంకటేష్, నాగార్జున వంటి టాలీవుడ్ టాప్ హీరోలు హీరోయిన్ల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే, బాలయ్య మాత్రం బొద్దందాల ముద్దుగుమ్మలను ఎంపిక చేయడంలోనే ఆసక్తి చూపుతున్నాడట.

వెంకీ, నాగ్ లాంటి స్మార్ట్ హీరోలు రొమాంటిక్ పార్ట్‌నర్స్‌ను తమ సినిమాల్లో నటింపజేసేందుకు మల్లగుల్లాలు పడుతుంటే.. బాలయ్య మాత్రం నయనతార లేదా అనుష్క వీరిద్దరూ దొరక్కపోతే.. బొద్దందాలతో కూడిన హీరోయిన్లనే ఎంపిక చేసుకుంటున్నాడని టాక్.

"అధినాయకుడు"లో ఇద్దరు సెక్సీ భామలు, లక్ష్మీరాయ్, సలోనిల ఎంపిక కూడా ఇలాగే జరిగిందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ ఇద్దరు గ్లామర్‌గా కనిపించినా.. జంబో లేడిస్‌గా ముద్రవేసుకున్నారు. అంతేకాదు.. అధినాయకుడులో ఈ ఇద్దరు భామలు భారీ ఎత్తున అందాలను ఆరబోసినట్లు సమాచారం. మరి జంబో లేడిస్ ఎంపిక బాలయ్యకు ఏమాత్రం కలిసివస్తుందో వేచి చూడాలి మరి...!