బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2020 (14:56 IST)

చుక్కలు చూపిస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్లు... బెయిల్ రావాలంటూ ప్రార్థనలు!

కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్నారు. నిజానికి ఈ ఇద్దరికీ వృత్తిపరమైన విభేదాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరూ బయటవున్నప్పుడు నిత్యం పోట్లాడుకుంటూ ఉండేవారు. అయితే, వారి అదృష్టమో, దురదృష్టమో తెలియదుగానీ... వీరిద్దరూ ఒకే కేసులో అరెస్టు కావడమే కాదు.. జైలులో ఒకే గదిలో ఉండాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది. దీంతో వారిద్దరూ నిత్యం పోట్లాడుకుంటూ జైలు అధికారులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారట. వారి సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారట. పైగా వీరికి త్వరగా బెయిలు రావాలని వేడుకుంటున్నారట. 
 
ఈ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన వీరిద్దరిని అగ్రహార సెంట్రల్ జైల్లోని ఒకే సెల్‌లో వీరిద్దరినీ ఉంచారట. అర్థరాత్రి వరకు నిద్రపోకుండా లైట్లు వేసుకుని రాగిణి పుస్తకాలు, దినపత్రికలు చూస్తోందట. మళ్లీ ఉదయాన్నే నిద్రలేచి లైట్లు వేసుకుని యోగాసనాలు వేస్తోందట. 
 
అలా లైట్లు వెలుగుతూ ఉండడం వల్ల తనకు నిద్ర పట్టడం లేదని సంజన ఫిర్యాదు చేస్తోందట. అలాగే మరికొన్ని విషయాల్లో సంజనపై రాగాణి కంప్లైంట్లు చేస్తోందట. వీళ్ల ఫిర్యాదులతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారట. ఈ హీరోయిన్లద్దరికీ బెయిల్ త్వరగా వచ్చేయాలని వారి కంటే పోలీసులే ఎక్కువగా కోరుకుంటున్నారట.