ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శనివారం, 14 మే 2016 (13:28 IST)

అఖిల్‌కి 'ఊపిరి' పోసే దర్శకుడు ఎవరు...? వంశీ పైడిపల్లి హ్యాండ్ ఇచ్చేశాడట...

అక్కినేని అఖిల్‌ తన టైటిల్‌లో పేరు పెట్టుకున్న హీరోగా చేశాక... ఫెయిల్యూర్‌ పొందాడు. అతన్ని గట్టెక్కించేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు తన సినిమాలు తన వ్యాపారాలతో బిజీగా వున్నాననీ, ఇక కొడుకులపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తానని ఇటీవలే నా

అక్కినేని అఖిల్‌ తన టైటిల్‌లో పేరు పెట్టుకున్న హీరోగా చేశాక... ఫెయిల్యూర్‌ పొందాడు. అతన్ని గట్టెక్కించేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు తన సినిమాలు తన వ్యాపారాలతో బిజీగా వున్నాననీ, ఇక కొడుకులపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తానని ఇటీవలే నాగ్‌ ప్రకటించారు. 'ఊపిరి' తర్వాత విజయం పొందిన నాగ్‌.. ఆ చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లికి బాధ్యత అప్పగించినట్లు తెలిసిందే. అయితే ఇప్పటి సమాచారం ప్రకారం. 
 
ఆ చిత్ర కథలో ఏవో మార్పులు చేయాల్సి రావడంతో... తను చేయకుండా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి.  హిందీ సినిమా 'యే జవానీ.. హే దివాని' చిత్రాన్ని రీమేక్‌  చేయాలని భావించారు. కానీ ఇప్పటికే రీమేక్‌ దర్శకుడిగా తనపై ముద్ర కూడా పడుతుందని తప్పుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఇదిలావుండగా తన తదుపరి చిత్రాన్ని రామ్‌‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరికి కథ కూడా చెప్పినట్లే తెలిసింది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.