బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (17:07 IST)

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ ఆందోళన.. వద్దని వారించిన హీరో

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం చెన్నై, కోడంబాక్కంలోని రజనీకాంత్ సొంత కళ్యాణ మండపం ఎదుట అభిమానులు చేరి ఆందోళనకు దిగారు. నిజానికి గత కొన్న

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం చెన్నై, కోడంబాక్కంలోని రజనీకాంత్ సొంత కళ్యాణ మండపం ఎదుట అభిమానులు చేరి ఆందోళనకు దిగారు. నిజానికి గత కొన్ని రోజులుగా రజనీ రాజకీయాల్లో చేరనున్నారనే వార్తలు పుకార్లు చేశాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించనున్న ఫ్యాన్స్‌ మీట్‌లో రజనీ రాజకీయరంగ ప్రవేశం గురించి ప్రకటిస్తారని వార్తలు రాశారు. అయితే అలాంటిదేమీ లేదని తర్వాత రజనీ స్పష్టం చేశారు. రజనీ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘2.0’ చిత్రంలో నటిస్తున్నారు. 2010లో విజయం సాధించిన ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో అమీజాక్సన్‌ కథానాయికగా నటిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.