ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 మార్చి 2017 (21:33 IST)

మరో అందగత్తెతో నటి మాజీ భర్త రెండో పెళ్లికి రెడీ... కళ్లెంట నీళ్లు పెట్టుకున్న హీరోయిన్...?

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, డేటింగులు, విడాకులు కామన్ అనే సంగతి తెలిసిందే. ప్రేమించుకున్నట్లే ప్రేమించుకుని కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటుంటారు. సెలబ్రిటీలు కావడంతో వారిపై ఫోకస్ మరీ ఎక్కువగా వుండటంతో చీమ చిటుక్కుమన్నా విషయం బయటకు తెలిసిపోతుంటుం

సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, డేటింగులు, విడాకులు కామన్ అనే సంగతి తెలిసిందే. ప్రేమించుకున్నట్లే ప్రేమించుకుని కొన్నాళ్ల తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటుంటారు. సెలబ్రిటీలు కావడంతో వారిపై ఫోకస్ మరీ ఎక్కువగా వుండటంతో చీమ చిటుక్కుమన్నా విషయం బయటకు తెలిసిపోతుంటుంది. తాజాగా నటి అమలా పాల్ మాజీ భర్త విషయం కూడా బయటకు వచ్చింది.
 
విషయం ఏంటయా అంటే... ప్రేమ వివాహం విఫలమై అమలా పాల్ నుంచి విడిపోయిన విజయ్ మరో అందగత్తెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైపోయాడట. విజయ్ తండ్రి ఇప్పటికే మూడు నాలుగు సంబంధాలు చూడగా వాటిలో మంచి అందచందం వున్న అమ్మాయి, ఆస్తిపాస్తులు కూడా వుండటంతో ఆ సంబంధాన్ని ఓకే చేసుకుంటున్నట్లు కోలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఈ వార్త అలాఇలా చివరికి అమలా పాల్ చెవిన పడిందట. దానితో గత స్మృతులు గుర్తుకు వచ్చి అమల కళ్లవెంట నీళ్లు పెట్టకుందట. కొద్దిసేపు ఉద్వేగానికి గురైందట.