ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (20:18 IST)

శ్రీముఖి లవ్వులో వుందా..? ఆ లక్కీ బాయ్ ఎవరబ్బా..?

టీవీ యాంకర్‌గానూ, సినీ నటిగా మంచి పేరు సంపాదించిన శ్రీముఖి.. బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తన అందం, అభియనంతో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టే ఈ భామ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. శ్రీముఖి ప్రస్తుతం ఓ వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా టాక్ సాగుతోంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. 
 
ఇదిలా ఉంటే ఈ వార్తలపై శ్రీముఖి ఇప్పటివరకు స్పందించలేదు. ఇంతకీ శ్రీముఖితో రిలేషన్ షిప్ ఉన్న ఆ లక్కీ బాయ్ ఎవరై ఉంటారా..? అంటూ..శ్రీముఖి ఫాలోవర్లు, అభిమానులు తెగ ఆలోచిస్తున్నారట. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది‌.
 
నిజానికి తాను ప్రేమ వివాహం చేసుకోనని.. ఇంట్లో అమ్మానాన్న చూసిన అబ్బాయినే చేసుకుంటానని ఆ మధ్య శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక వేళ తాను ఎవరినైనా ఇష్టపడితే ముందు అమ్మానాన్నకు చెబుతానని.. వాళ్లు ఓకే చెబితేనే ముందడుగు వేస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు శ్రీముఖికి ఇష్టమైన అబ్బాయి దొరికేశారా? ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.