శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (15:11 IST)

"బహిష్కరణ"లో ఆ సీన్స్ చేసేటప్పుడు అందరినీ బయటికి పంపించేశారు..

Anjali look
"బహిష్కరణ" వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఇంటిమేట్ సన్నివేశాలపై సినీనటి అంజలి స్పందించింది. బహిష్కరణలో ఇంటిమేట్ సన్నివేశాలు చేసే సమయంలో అందరినీ బయటికి పంపి వాటిని చిత్రీకరించారు. అయినా ఆ సీన్ చేసే సమయంలో కొంచెం గందరగోళానికి గురయ్యానని తెలిపింది. ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదు. 
 
Anjali look
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో తన పాత్రకు తగినంత న్యాయం చేశాను. సినిమా రిలీజ్ తర్వాత తన పాత్రకు మంచి స్పందన వచ్చిందని అంజలి చెప్పుకొచ్చంది. 
 
ఇదే విధంగా నవరస సిరీస్ కోసం కాస్ట్యూమ్ కోసం కొన్ని గంటల పాటు వాష్ రూమ్‌కు కూడా వెళ్లలేదని.. ప్రతి సినిమాకు హోమ్ వర్క్ కంపల్సరీ చేసేదాన్ని అంటూ అంజలి వెల్లడించింది. 
 
పాత్రకు ప్రాధాన్యం వుండే రోల్స్ చేస్తానని, కొన్ని సినిమాల కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నానని అంజలి తెలిపింది. అలాగే రూమర్స్ చదివి బాధపడతాను. అంతే మళ్లీ త్వరగా మరిచిపోతాను. తన పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అందుకని పెళ్లి చేసుకోలేను కాబట్టి.. సమయం వచ్చినప్పుడు చేసుకుంటానని అంజలి క్లారిటీ ఇచ్చింది.