గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (09:10 IST)

నాలుగో పెళ్లి చేసుకోబోతున్న వనితా విజయ్ కుమార్..?

vanitha
కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్, దివంగత మంజుల కుమార్తె అయిన వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే మూడు పెళ్ళిళ్లు ఆమెకు కలిసిరాలేదు. దీంతో ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా వుంది వనిత. తన కుమార్తెను సినిమాల్లోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 
 
అయితే తాజాగా ఆమె నాలుగో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ అభిమాని వనిత విజయకుమార్‌ను తదుపరి పెళ్లి గురించి ప్రశ్నించ‌గా, అందుకే ఆమె ఊహించనిది ఊహించండి అంటూ స‌మాధానం ఇచ్చింది. ఈ వ్యాఖ్యల వెనుక ఆమె నాలుగో పెళ్లి వ్యవహారం వుందని అందరూ భావిస్తున్నారు. 
 
కాగా చంద్ర‌లేఖ అనే సినిమాతో చిత్ర సీమ‌లోకి అడుగుపెట్టిన ఈ అమ్మ‌డు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగువారిని పలకరించింది. దేవి సినిమా త‌ర్వాత వ‌నితాకి అవ‌కాశాలు బాగానే వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆమె పెళ్లి చేసుకోవ‌డంతో సినిమాల‌కి గ్యాప్ ఇవ్వాల్సి వ‌చ్చింది.
 
తొలుత నటుడు ఆకాష్‌ను ఆమె వివాహం చేసుకోగా.. వీరికి విజయ్ శ్రీ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు జ‌న్మించారు. ఇక కొన్నాళ్ల‌కి ఆకాశ్ నుండి విడిపోయి వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్‌ను పెళ్లాడారు వనిత. వీరికి జయనిత అనే పాప జన్మించింది. 
 
అత‌నితోను విడాకులు తీసుకున్న ఆమె చాలా ఏళ్ల పాటు సింగిల్‌గానే ఉంది. అలాగే మూడోసారి పీటర్‌ను పెళ్లాడింది. ఆయన నుంచి కూడా వనిత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.