కాశీలో కల్లు దుకాణం - కల్కి సీక్వెల్‌లో కనిపిస్తుందా?
ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ సినిమా కల్కి 2898AD. ప్రభాస్ నటించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా వెయ్యికోట్లు అంటూ ప్రచార పోస్టర్లు చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనిపై కాంట్రవర్సీ వుండగా, మరోవైపు కల్కి సెట్లో వున్న ఓ ఫొటోను దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల కచేశారు. భైరవ ఎంట్రీ సీన్ మేకింగ్ నుండి, Kalki2898AD సెట్‌లలో డైనమిక్ ద్వయం మీ కోసం ఇదిగో అంటూ అభిమానుల అలరించేలా చూపించారు.
కాగా, కల్కి కోసం కాశీ సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేశారు. ఇంకో సెట్ కాంప్లెక్స్‌ను శేరిలింగంపల్లిలోని ఓ ప్రాంతంలో వేశారు. శంబాలా సెట్‌ను అక్కడ సమీపంలోని అశ్వనీదత్ గారి కొన్ని ఎకరాల స్థలంలో వేశారు. అయితే, కాశీ సెట్‌లో కాలభైరవ బుజ్జితో ట్రావెల్ అయ్యే ప్రాంతంలో కల్లు దుకాణం కూడా వుంది. గ్రాఫిక్ మాయాజాలంలో అది మొదటి భాగంలో వుందా? లేదా సీక్వెల్‌లో వుంటుందా? అనే అనుమానం సెట్ చూసిన వారికి కలుగుతుంది. మరి కల్కి పుట్టే కాలంలో కల్లు దుకాణం కూడా వుంటుందా? లేదా? ఇది దర్శకుడి క్రియేషనా? అనేది త్వరలో తెలియనుంది.