శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (11:51 IST)

బుక్ మై షోలో 'జవాన్' రికార్డును అధికమించిన 'కల్కి'!!

Kalki 2898 AD
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ హీరోగా నటించిన నటించిన చిత్ర "కల్కి". ఈ చిత్రం ఇప్పటికే సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. కలెక్షన్ల పరంగా రూ.1000 కోట్లు దాటేసింది. ఇపుడు బుక్ మై షోలో కూడా సరికొత్త రికార్డును నెలకొల్పింది. బుక్ మై షో యాప్‌లో అత్యధిక టిక్కెట్లు బుక్ అయిన చిత్రంగా కల్కి నిలిచింది. దాదాపు 1.25 కోట్లు టిక్కెట్లు బుక్ అయిన చిత్రంగా రికార్డులకెక్కింది. తద్వారా బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా పేరిట ఉన్న ఈ రికార్డును అధికమించింది. 'జవాన్' సినిమా 1.20 కోట్ల టిక్కెట్ బుకింగ్స్‌తో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గురువారం ఒక్కరోజే దాదాపు 1.30 లక్షల టిక్కెట్లు "కల్కి" చిత్రం కోసం బుక్ అయినట్టు బుక్ మై షో వెల్లడించింది. 
 
కాగా, ''కల్కి'' చిత్రం గత నెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దాదాపు నెల రోజులు కావొస్తున్నప్పటికీ ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణ మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఇలా రూ.వెయ్యి కోట్లు రాబట్టిన ఏడో భారతీయ చిత్రంగా, ప్రభాస్ నటించిన రెండో చిత్రంగా రికార్డు పుటల్లో నిలిచింది. ఇపుడు వారాంతం రావడంతో ఈ చిత్రం బుకింగ్స్‌తో పాటు కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.