సోమవారం, 16 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జులై 2024 (18:44 IST)

147 టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఇంగ్లండ్ సంచలన రికార్డు!!

england vs west indies
147 యేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సంచలన రికార్డును నెలకొల్పింది. కేవలం 4.2 ఓవర్లలోనే 50 పరుగులు సాధించింది. సొంత గడ్డపై పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 4.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. 1994లో ఓవల్ మైదానంలో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు చేయగా, ఇపుడు 4.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసి తన రికార్డును తానే బద్ధలుకొట్టింది. టెస్ట్ క్రికెట్‌లో ఆ జట్టు దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ బజ్‌బాల్ వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇందులోభాగంగా పవర్ హిట్టింగ్ జోడీ బెన్ డకెట్, ఓలీ పోప్‌ల దూకుడికి ఈ స్కోరు సునాయాసంగా చేసింది. 
 
మరోవైపు, ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా గురువారం ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఇంగ్లండ్‌‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుదిజట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
ఇంగ్లండ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మార్క్ ఉడ్, షోయబ్ బషీర్.
 
వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథానాజ్, కావెం హాడ్జ్, జాసన్ హోల్డర్, సిల్వా (వికెట్‌ కీపన్), కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్.