ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (23:00 IST)

చరిత్రలో నిలిచిపోనున్న రాజ్ కోట్ టెస్టు.. ఎన్నో విశేషాలు

Rajkot Test
Rajkot Test
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రాజ్ కోట్ టెస్టు చరిత్రలో నిలిచిపోనుంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇది కెరీర్‌లో 100వ టెస్ట్. ఈ మైలు రాయిని అందుకున్న ఇంగ్లండ్ క్రికెటర్‌గా బెన్ స్టోక్స్ చరిత్రకెక్కనున్నాడు. ఇక టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఈ ఫీట్ సాధిస్తే భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 
 
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు పడగొడితే 700 వికెట్ల మైలురాయి అందుకోనున్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మూడో టెస్ట్‌ రెడీ అయ్యింది. ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. తొలి రెండు టెస్ట్‌ల్లో చెరొక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలోనే మూడో టెస్ట్‌లో విజయం సాధించి పై చేయి సాధించాలనుకుంటున్నాయి.