1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (12:21 IST)

ఆర్ఆర్ఆర్, సలార్ రికార్డును బ్రేక్ చేసిన Kalki 2898 AD

Kalki 2898AD
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఎట్టకేలకు జూన్ 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైన కల్కి సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక ఓపెనింగ్స్ సాధించింది. ఇది ఇప్పటికే సినిమా చరిత్రను తిరగరాస్తోంది. 
 
ఈ చిత్రం విడుదలకు ముందే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ ఉత్కంఠను రేకెత్తించింది. ప్రీమియర్‌కి పది రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్‌లు తెరవబడ్డాయి. టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. 
 
ఒక్క ఉత్తర అమెరికాలోనే, 'కల్కి' ప్రీ-సేల్స్‌లో $3.5 మిలియన్‌లను సేకరించి, గతంలో ఆర్ఆర్ఆర్, సలార్ సెట్ చేసిన బెంచ్‌మార్క్‌లను అధిగమించింది. అలాగే గతంలో షారుఖ్ ఖాన్ జవాన్ పేరిట ఉన్న మొదటి-రోజు కలెక్షన్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది.