1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (08:04 IST)

ప్రభాస్ "కల్కి" అవతారం విరామం వరకు ఎలా ఉందంటే...

kalki 2898 ad
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఏపీలో ఉదయం 4.30 గంటలకే తొలి ఆటను ప్రదర్శించారు. ఈ చిత్రం విరామం వరకు కథ ఎలా ఉందంటే.. మహాభారతం చివరిలో ద్రోణాచార్యుడు పాండవుల నాశనం కోరుతూ యుద్ధభూమిలో ఓ ఆయుధం విసురుతాడు. దానితో కోపోద్రిక్తుడైన కృష్ణుడు శాపం ఇస్తాడు. వేల ఏళ్ళు కలియుగం అంతం వరకు బతికి ఎన్నో అకృత్యాలు చూడు. కల్కి అవతారంగా నేనే జన్మిస్తాను అంటూ శపిస్తాడు. 
 
ఆ తర్వాత కాశీలో 2898 నాటి మనుషులు, సాంకేతికతతో కొత్త లోకంగా ఉండే కంప్లేస్‌లో ప్రవేశానికి అందరూ ట్రై చేసి ఫెయిల్ అవుతారు. అలా ప్రభాస్ కూడా ఫెయిల్ అవుతాడు. ఇక కాంప్లెక్స్‌లో ఏమి జరుగుతుంది? దీపిక పాత్ర ఏమిటి? అనేది ఇంటర్వెల్ వరకు సాగే కథ. ఇది హాలీవుడ్ రేంజ్‌లో సాంకేతికత. ఎగిరే మనుషులు, వాహనాలు.. వింతగా అనిపిస్తాయి.. వర్మ, దుల్కర్.. కమల్ పాత్రల్లో వైవిధ్యం కనిపిస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారు.