ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 జూన్ 2024 (18:40 IST)

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

Kamal Haasan
Kamal Haasan
హైలీ యాంటిసిపేటెడ్ మాగ్నమ్ ఓపస్ కల్కి 2898 AD యూనిక్ స్టొరీ లైన్, థీమ్, బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. విడుద‌ల‌కు ఒక్క రోజు మిగిలి ఉన్న నేప‌థ్యంలో ఈ సినిమా అన్ని రైట్ రీజన్స్ తో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.
 
కల్కి 2898 AD మోస్ట్ ఎక్సయిటింగ్ అంశాలలో ఒకటి ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత రీయూనియన్ కావడం. వీరిద్దరూ 1985 కల్ట్ క్లాసిక్ గెరాఫ్తార్‌లో స్క్రీన్‌ షేర్ చేసుకున్నారు. బ్రదర్స్ కరణ్, కిషన్ పాత్రలను పోషించారు. సెప్టెంబరు 13, 1985న విడుదలైన ఈ చిత్రం నేటికీ అందరికీ ఇష్టమైన క్లాసిక్‌గా నిలిచింది.
 
కల్కి 2898 ADలో కమల్ హాసన్  సుప్రీం యాస్కిన్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్ లో కమల్ హసన్ లుక్, గెటప్ అందరినీ చాలా సర్ప్రైజ్ చేసింది. సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ లో కమల్ హసన్ మేకోవర్ అన్ బిలివబుల్ అండ్ స్టన్నింగ్ గా వుంది. మునుపెన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్ అవతార్ లో అద్భుతంగా అలరించబోతున్నారు కమల్ హసన్.
 
ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ గా కనిపించనున్నారు. ఈ లెజెండరీ స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో కలిపి ఈ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రెండు పాత్రల గ్లింప్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి, చాలా ఆసక్తిని రేకెత్తించాయి, సినిమా కోసం అంచనాలను పెంచాయి.
 
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఎక్సయిట్మెంట్ పెరుగుతూనే ఉంది. కల్కి వినూత్న కథాంశం, స్టార్-స్టడెడ్ లైనప్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఆన్-స్క్రీన్ రీయునియన్ చూసే అవకాశం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 AD ఇండియన్ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉంది. ఇది లెజెండరీ ట్యాలెంట్, భారతీయ పురాణాలను డిస్టోపియన్ ఫ్యూచర్‌తో బ్లెండ్ చేసిన గ్రౌండ్ బ్రేకింగ్ స్టొరీ టెల్లింగ్ ని అందిస్తోంది.
 
విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి 2898 AD జూన్ 27, 2024న థియేటర్లలోకి రానుంది. ఈ మాగ్నమ్ ఓపస్ లోబిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీ రోల్స్ పోషిస్తున్నారు.