'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!
"కల్కి 2898ఎడి" సినిమాకు మొత్తంగా రూ.385 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం ఆంధ్రా థియేట్రికల్ హక్కులకు రూ.85 కోట్లు అమ్మడుపోయినట్టు సమాచారం. సీడెడ్‍లో రూ.27 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడయ్యాయి. నైజాం థియేట్రికల్ హక్కులను మేకర్స్ రూ.70 కోట్లకు విక్రయించారు.
ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో కల్కి మూవీకి ఏకంగా రూ.180 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు వెల్లడయ్యాయి. వీటిలో కొన్ని అడ్వాన్స్ రూపంలో ఉన్నాయి. ఈ సినిమాకు ఉత్తరాదిన థియేట్రికల్ హక్కులు రూ.80 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. ఇకపోతే, కర్ణాటకలో రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని, తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులు రూ.22 కోట్లకు అమ్ముడైనట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
చివరగా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులకు ఏకంగా రూ.80 కోట్ల భారీ ధర పలకడం గమనార్హం. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.389 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుకావడం గతంలో ఎన్నడూ లేదని చిత్రపరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. థియేట్రికల్ బిజినెస్ లెక్కల ప్రకారం.. "కల్కి 2898 ఏడీ" సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.800 కోట్ల గ్రాస్ వసూళ్ళు రావాల్సి ఉంది.
ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా రూ.1000 కోట్ల మార్క్ అందుకోవాలని.. తమ హీరో బాక్సాఫీసు సత్తా చూపించాలని ఎదురుచూస్తున్నారు. అదేసమయంలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే రూ.50 కోట్ల వరకు రీచ్ అయ్యే అవకాశముందని ట్రెడ్ అంచనా వేస్తోంది. ఓవర్సీస్‌లో 2.6 మిలియన్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో క్రాస్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రం ఓటీటీ బిజినెస్ కూడా రూ.300 కోట్ల వరకు జరిగిందనే టాక్ వినిపిస్తుంది. హిందీ వెర్షన్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ డీల్ కుదిరించుకుందని.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్‌లకు అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు సమాచారం.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో ఎటు చూసినా ఇప్పుడు కల్కీ సినిమా మినహా మరో ఆప్షన్ లేకపోవడంతో మల్టీప్లెక్స్ చైన్స్‌లో ఈ సినిమా ప్రదర్శన భారీగా ఉండనుంది. కల్కీ ఐమ్యాక్స్ వెర్షన్‌ను ఎక్స్ పీరియన్స్ చెసెందుకు ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజెన్స్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నార్త్‌లో ప్రభాస్‌కున్న క్రేజ్‌తో పాటు అమితాబ్ దీపికా స్టార్ పవర్ ఓపెనింగ్స్ ప్రధానబలంగా కానుంది.
ఇక తెలుగు రాష్ట్రాలలో గత ఐదు నెలలుగా స్టార్ హీరో సినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలో ప్రభాస్ కల్కీ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ పాజిటివ్‌గా వస్తే చాలు రెండు వారాల పాటు బాక్సాఫీసు వద్ద కల్కీకి కలెక్షన్‌ల వర్షమేనని వారు అంటున్నారు.