సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2019 (21:08 IST)

ఆ విషయంలో ప్రియమణికి సపోర్ట్ చేస్తున్న సమంత, అనుష్క

హీరోలతో సమానంగా మేము నటిస్తున్నాం. మా క్యారెక్టర్లు సినిమాలో కీలకమే. కష్టమూ ఎక్కువే. మమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తారు. హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్లో కనీసం 10 శాతం కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తోంది సీనియర్ హీరోయిన్ ప్రియమణి.
 
61 సినిమాలు చేసిన ప్రియమణి ఇప్పుడు చేస్తున్న సినిమాలకు మాత్రం తాను నిర్మాత ఇచ్చేంత డబ్బులు తీసుకోనని... తాను డిమాండ్ చేసినంత నిర్మాత ఇవ్వాలని చెబుతోందట. అది కూడా హీరోకు ఎంత ఇస్తే అంత డబ్బులు తనకు ఇవ్వాలట. ఇప్పటివరకు ఈ విషయం కాస్త సినీ పరిశ్రమలో బహిర్గతం కాకపోయినా చర్చ మాత్రం జరుగుతోంది.
 
కానీ ప్రియమణి ఈవిధంగా మాట్లాడగానే ఇద్దరు హీరోయిన్లు ఆమెకు సపోర్ట్ చేశారు. సమంత, అనుష్కలిద్దరు కూడా ప్రియమణి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదంటున్నారు. కో-స్టార్లకు ధీటుగా నటిస్తున్న తమకు రెమ్యునరేషన్ అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట ప్రియమణి. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నవారే కాదు బాలీవుడ్ నటీమణులు కరీనాకపూర్, ఆలియాభట్‌లు కూడా ప్రియమణి చేసిన వ్యాఖ్యలను సపోర్ట్ చేశారట.
 
ఈ చర్చ సినీపరిశ్రమలో ఇలాగే సాగితే మాత్రం హీరోయిన్లకు హీరోలతో సమానంగా ఖచ్చితంగా రెమ్యునరేషన్ ఇచ్చితీరుతారంటున్నారు సినీ విశ్లేషకులు.