శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:10 IST)

అనుష్క స్లిమ్ అయ్యింది అందుకోసమేనా...?

హీరోయిన్ ఓరియెంటడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయ్యిన అనుష్క శెట్టి "భాగమతి" సినిమా తర్వాత మరే సినిమా చేయలేదు. దాదాపు సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో బరువు తగ్గించుకుని మరింత అందంగా కొత్త లుక్‌తో ప్రేక్షకులకు దర్శనమిచ్చారు. 
 
ఈ పిక్స్ చూసిన అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ ఫోటోలలో అనుష్క పక్కన ఉన్న కొత్త వ్యక్తి ఎవరో తెలియక, అనుష్క బాయ్ ఫ్రెండ్ అనే రూమర్స్ వ్యాపించాయి, కానీ తర్వాత అతని పేరు లుకె కౌంటినో అని, అతనో అవార్డ్ విన్నింగ్ న్యూట్రీషియనిస్ట్ అని తెలిసాక ఆ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడింది.
 
అనుష్క 'సైలెంట్' పేరుతో తెరకెక్కుతున్న మూవీ కోసం ఈ స్లిమ్ లుక్‌లోకి మారారంట. ఈ సినిమాతో హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనుష్కతో పాటు మాధవన్, అంజలి, సుబ్బరాజు, శాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు ఇందులో నటిస్తున్నారు. 
 
ఇటీవల ఈ సినిమా గురించి లీక్ అయిన వార్తలను బట్టి అనుష్క ఎన్నారై పాత్రలో, అంజలి ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్రలలో కనిపించనున్నారట. మార్చి నుండి విదేశాలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారంట.