గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (11:45 IST)

ఉప్పు కలిపిన వేరుశెనగలు తింటే..?

నట్స్ తరహాలో పల్లీలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీలు శరీరంలో ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి. వేరుశెనగల్లో ఉంటే ఫైబర్, ప్రోటీన్స్ అధిక బరువును తగ్గిస్తాయి. వేరుశెనగల్లోని ప్రోటీన్స్ ఎక్కువ సమయం పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. దీని కారణంగా ఆహార పదార్థాలపై ఎక్కువ మొగ్గుచూపరు. తద్వారా అనవసరంగా బరువు పెరుగుతుంటారు. 
 
అయితే బరువు తగ్గాలనుకునేవారు వేరుశెనగల వలన అలర్జీలు వస్తాయో లేదోనని పరిశీలించి తీసుకోవాలి. ఒకవేళ ఎలాంటి అలర్జీ చర్యలు లేకుండా ఉంటే రోజుకు 50 గ్రాముల వేరుశెనగలను తీసుకోవచ్చు. ఇలా రోజూ మోతాదుకు మించకుండా వేరుశెనగల్ని తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలానే వేరుశెనగలను వేయించి లేదా ఉడికించి తీసుకోవడం ఉత్తమం. వేరుశెనగ తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు క్రమబద్ధీకరించబడుతాయి. 
 
ఇక ఉప్పు కలిపిన వేరుశెనగలను తీసుకుంటే.. ఆరోగ్యానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు కలిపిన వేరుశెనగల్ని తినడం ద్వారా బరువు పెరగడం.. మధుమేహం వంటి వ్యాదులు తప్పవని వారు చెప్తున్నారు.