శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (09:50 IST)

అవిసె గింజలు నానబెట్టిన నీరు తాగితే..?

అవిసె గింజలు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. తరచు వీటిని తీసుకోవడం వలన అధిక బరువు తగ్గొచ్చని.. ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. అవిసె గింజలలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటి ఖనిజాలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించుటకు ఎంతగానో దోహదపడుతాయి. ఇవి వేయించి తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. 
 
అవిసె గింజల్లోని ఫ్యాటీ యాసిడ్స్ అధికి బరువును తగ్గించడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. చాలామందికి చిన్న వయసులోనే అజీర్తి సమస్యతో బాధపడుతుంటారు... అలాంటప్పుడు కొన్ని అవిసె గింజలను నీటిలో నానబెట్టుకోవాలి. కాసేపటి తరువాత ఆ నీటిని మాత్రం తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
ఒత్తిడి కారణంగా చాలామంది హైబీపీతో సతమతమవుతుంటారు. అలాంటివారు.. ప్రతిరోజూ అవిసె గింజలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటున్నారు వైద్యులు. కప్పు అవిసె గింజలను తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆపై వాటిలో కొద్దిగా నీరు పోసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన వాటిని తాలింపు పెట్టి తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా ప్రతిరోజూ కాకాపోయినా వారంలో రెండుసార్లు అవిసె గింజలను ఉడికించి తీసుకుంటే.. డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉండడమే కాకుండా.. శరీరంలోని కొవ్వు పదార్థాలన్నీ తొలగిపోతాయి.