సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:26 IST)

గుడ్డును నూనెలో వేయించి తీసుకుంటే..?

కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కోడిగుడ్డులో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, న్యూట్రియన్ ఫాక్ట్స్ అధిక మోతాదులో ఉన్నాయి. కోడిగుడ్డులో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడైంది. రోజుకో గుడ్డు తీసుకుంటే మంచిదంటున్నారు వైద్యులు. తరచు గుడ్డు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
1. డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు రోజుకో గుడ్డు తీసుకుంటే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ గుడ్డు తినకపోతే మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు.
 
2. ఓ బౌల్‌లో గుడ్లను ఉడికించుకోవాలి. ఆపై వాటి తొక్కలను తీసి గుడ్లను సగంగా కట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ గుడ్లకు కొద్దిగా ఉప్పు, కారం రాసి నూనెలో వేయించి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ప్రతిరోజూ ఇలా చేసి తీసుకుంటే అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది.
 
3. గుడ్డులో ఉండే జీవ రసాయన సమ్మేళనాలు డయాబెటిస్ రాకుండా చూస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ప్రతిరోజూ గుడ్డు తప్పకుండా తీసుకోండి.. 
 
4. గుడ్డును వేపుడుగా చేసి తీసుకుంటే ఆకలి నియంత్రణకు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డులోని యాంటీ ఫంగల్ గుణాలు శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. దాంతో పాటు శరీరానికి కావలసిన ఎనర్జీని కూడా అందిస్తాయి. 
 
5. చాలామంది తరచు చెప్పేమాట.. గుడ్డు తింటే జీర్ణం కాదని.. కానీ అది నిజం కాదు. గుడ్డులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.