డయాబెటిస్ ఉందా లేదా అనే విషయాన్ని.. ఇలా చేసి..?
చక్కెర వ్యాధిని నియంత్రించడం చాలా కష్టమని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. నిజానికి పెద్ద కష్టమేమీ కాదంటున్నారు వైద్యులు. దీన్ని సులువుగా నియంత్రించాలంటే కొన్ని చిట్కాలను ఇంట్లోనే పాటిస్తే సరిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా శరీరానికి ఎంత ఆహారం, నీరు అవసరమో అంతే తీసుకోవడం.
ఉదయం టీ మొదలుకుని టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంతా సరిగ్గా ఉండాలి. రోజూ ఒకే సమయంలో, ఒకే పరిమాణంలో ఆహారం తీసుకోవడం వలన శరీరం నుండి షుగర్ ఒకేలా ఉత్పత్తి అవుతుంది. ఇలా క్రమశిక్షణతో ఆహారం తీసుకున్నప్పుడు దాన్ని బట్టి వైద్యులు మందుల మోతాదు సూచిస్తారు. ఆహారం, మందులు మ్యాచ్ అయితే షుగర్ ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది.
అలానే మీ రక్తంలో ఎంత షుగర్ లెవల్ ఉందో నిరంతరం చెక్ చేయించుకుంటూ ఉండాలి. వేళకి సరిగ్గా తినడం, పడుకోవడం, నిద్రలేవడం అన్ని టైం ప్రకారం చేయాలి. అరగంట శారీరక శ్రమ (వ్యాయామం) విధిగా చేయాలి. ఇంట్లో ఏదైనా పని చేయవచ్చు. నడక, సైకిల్ తొక్కడం వంటివి క్రమం తప్పకుండా చేస్తే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.