Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ డైరెక్టరుతో బాలయ్య సినిమా ఫిక్స్...

Written By శ్రీ
Updated: ఆదివారం, 4 అక్టోబరు 2020 (14:09 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కావడం.. ఈ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌ను యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరడం లేదు. సమ్మర్‌కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. పూరి జగన్నాథ్‌తో బాలయ్య "పైసా వసూల్" అనే సినిమా చేసాడు. ఈ సినిమాతో బాలయ్య - పూరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. బోయపాటి సినిమా తర్వాత పూరితో బాలయ్య సినిమా ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత పూరితో కాదు వినాయక్‌తో బాలయ్య సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... బాలయ్య సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్‌తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాకి కథ మాటలు బుర్రా సాయిమాధవ్  అందిస్తున్నారని సమాచారం.
 
బాలయ్య - బి.గోపాల్ మూవీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనుకున్నారు కానీ.. ఈ మూవీ ఫిక్స్ అని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. 

అన్నీ చూడండి

ఆర్థిక యుద్ధంలో గల్ఫ్ దేశాలు చేరితే తీవ్ర పరిణామాలు తప్పవు : ఇరాన్ హెచ్చరిక

ఇరాన్‌తో ఆట ముగింపుకొచ్చింది... టెహ్రాన్‌కు సాయం చేసే దేశాలపైనా కఠిన ఆర్థిక ఆంక్షలు

ప్రేమ కోసం తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు ఆత్మహత్య

కులాంతర వివాహానికి అడ్డొస్తారని మత్తు ఇంజెక్షన్‌తో తల్లిదండ్రుల హత్య... ఆ తర్వాత..

భారతదేశంలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడింది..

అన్నీ చూడండి

విదేశాల్లోనూ సాధ్యం కాని చికిత్స.. హైదరాబాద్‌లో సుడాన్‌ రోగికి మళ్లీ నడక

న్యూమోనియా ఎదుటివారికి అంటుకుంటుందా?

నిమ్మకాయ టీ తాగుతున్నారా?

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తర్వాతి కథనం
Show comments