స్నేహితురాళ్లతో కలిసి భూమికా చావ్లా మందుపార్టీ చేసుకున్నారా?
సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఫోటోలు ఏమయినా కాస్త తేడాగా అనిపిస్తే ఇక అంతేసంగతులు. వెంటనే వాటిని వాడేస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. భూమిక ఈమధ్య ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన స్నేహితురాళ్లతో కలిసి ఓ ఫోటో దిగింది. అందులో ఆమె గ్లాసులో ద్రవం నింపుకుని ఫోజిచ్చింది.
ఆ గ్లాసులో వున్న ద్రవం మంచినీళ్లా లేకా హాట్ డ్రింకా అనేది తెలియదు కానీ, భూమిక మందు కొట్టిందంటూ నెట్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత వుందో తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే.. ఆమధ్య యూ టర్న్, ఎంసిఎ చిత్రాల్లో నటించి సెకండ్ ఇన్నింగ్స్ స్ట్రాంగ్ అనుకున్న భూమికకు ఆశించిన ఆఫర్లు మాత్రం రావడంలేదు. కానీ రాలేదు కనుక డీలా పడే ఛాన్స్ లేదంటోంది ఈ బ్యూటీ. అంతేగామరి.