శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (10:17 IST)

ఫోటో తీస్తూ.. స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన కెమెరామెన్

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం మామూలే. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే? ఓ వివాహాంలో వెడ్డింగ్‌ ఫోటో గ్రాఫర్‌ వధూవరుల వీడియో తీస్తూ… అనుకోకుండా స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం పేజీలో వైరల్‌ అవుతోంది. 
 
వీడియోలో వధూవరులు తమ ఇంటి భవనం నుంచి బయటకు వస్తుంటారు. చుట్టాలు, సన్నిహితుల మధ్య ఫోటో షూట్‌ జరుగుతూంటుంది. ఈ అద్భుతమైన క్షణాలను వారికి ఎదురుగా ఉన్న ఫోటో, వీడియో గ్రాఫర్‌ తమ కెమెరాల్లో బంధిస్తూంటారు. అయితే, వెంటనే ఆ జంట ఆశ్చర్యకరంగా నోరెళ్లదీసి చూస్తుంటారు.
 
వారు చూస్తుండగానే ఫోటోగ్రాఫర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయి, వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఈ దృశ్యాన్ని వాళ్లు కళ్లారా చూసి అలా అయిపోయారు. ఆ మూమెంట్‌ను కూడా వీడియోలో జూమ్‌ చేసి మరీ చూపిస్తారు. ఇప్పటికే ఈ వీడియో లక్ష వ్యూస్‌ను దక్కించుకుంది. 
 
నెటిజన్ల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఏది ఏమైనప్పటికీ పూల్‌లో పడ్డ ఫోటోగ్రాఫర్‌ కొద్ది సమయంలోనే తేరుకుని, మళ్లి తన పనిలో పడ్డాడని, వావ్‌! అద్భుతమైన రికవరీ! అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.